Online Puja Services

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా పాట

18.221.245.196

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా పాట |Rama Rama Anarada Raghupati Rakshakudani Vinaleda song | Lyrics in Telugu

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ విను వారికి 
కామజనకుని కథ విను వారికి 
కైవల్యంబే కాదా?

నారదాది మునులెల్ల నుతించెడి నారాయణుడే కాదా 

కోరిన కోరిక నెల్ల నొసంగెడి 
కోరిన కోరిక నెల్ల నొసంగెడి 
గుణశాలని వినలేదా 

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
కోరిన కోరిక నెల్ల నొసంగెడి 
గుణశాలని వినలేదా 

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

ఆపద్భాందవుడగు శ్రీరాముని ఆరాధింపగ రాదా
ఆపద్భాందవుడగు శ్రీరాముని ఆరాధింపగ రాదా

పాపంబులు పరిహారమొనర్చెడి 
పాపంబులు పరిహారమొనర్చెడి
పరమాత్ముండే కాదా!!

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
పాపంబులు పరిహారమొనర్చెడి
పరమాత్ముండే కాదా!!

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా 
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా

నీరజాక్షుని నిరతము నమ్మితే  
నీరజాక్షుని నిరతము నమ్మితే  
నిత్యానందమే కాదా!!

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
నీరజాక్షుని నిరతము నమ్మితే  
నిత్యానందమే కాదా!!

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

వసుధను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడె కాదా

పసివాడగు శ్రీ రంగదాసుని 
పసివాడగు శ్రీ రంగదాసుని
పాలించుట వినలేదా!! 

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
పసివాడగు శ్రీ రంగదాసుని
పాలించుట వినలేదా!! 

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ విను వారికి 
కామజనకుని కథ విను వారికి 
కైవల్యంబే కాదా?

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

రఘుపతి రక్షకుడని వినలేదా
రఘుపతి రక్షకుడని వినలేదా

Rama Rama, Anarada, Raghupati, Rakshakudani, Vinaleda, Song

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore